గిరిజనులకు హక్కులు దక్కేదిఎప్పుడు…?
కామారెడ్డి జిల్లా ఎల్ పీ హెచ్ ఎస్ అధ్యక్షులు గణేష్ నాయక్ బతుకమ్మ, మాచారెడ్డి: ఊహించని వేగంతో దూసుకు వస్తున్న కార్పొరేట్ శక్తులకు సాగిలబడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యల వల్ల అడవులు, గుట్టలు మాయమై పోతున్నాయి. ఇక అడవులు, అక్కడి భూములు, ప్రకృతి పై గిరిజనులకు హక్కులు దక్కేదెప్పుడని కామారెడ్డి జిల్లా లంబాడ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ ప్రశ్నించారు. ప్రపంచ గిరిజన ఆదివాసి దినోత్సవం సందర్బంగా ఆయన మాట్లాడారు. ఆదివాసీల సంరక్షణ చట్టాలకు ఐక్యరాజ్యసమితి ఆమోదం తెలిపిన...