Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 May 2025, 6:44 pm Posted by : ramakrishna

పేదోడి సొంత ఇంటి కల నెరవేరిన వేళ

  • ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి నియోజకవర్గం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలోనే నియోజకవర్గానికి 3500 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు అయ్యాయి. అందులో భాగంగా మంగళవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని 7వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పది మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అందజేశారు. పేదల ఇంటి కలను సాకారం చేసే దిశగా ముందడుగు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ ప్రజలకు సొంత ఇంటి ఉండడం ఒక కల అని ప్రజలు అందరు తమకు సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారని అన్నారు. 10 మంది లబ్ధిదారులకు సొంత ఇంటి నిర్మాణం కొరకు భూమి పూజ చేసినందుకు, మంజురు పత్రాలను అందించినందుకు చాల సంతోషంగా ఉందని అన్నారు.

When a poor man's dream of owning his own home comes true