Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 February 2025, 7:42 pm Posted by : ramakrishna

విధులకు మధ్యాహ్నం వస్తే తప్పేంటి …?

  • ఇంట్లో పనులుంటాయి.. ఎప్పుడైనా వస్తారు
  • బాద్యతారాహిత్యంగా అధికారి వ్యాఖ్యలు  
  • డెయిరీని దిగజార్చుతున్న షెడ్ అధికారులు  

 

నిజామాబాద్, బతుకమ్మ: విధులు సక్రమంగా నిర్వహించాలని చెప్పాల్సిన షెడ్ అధికారి, సమయానికి రాని వారిపట్ల అనుకూలంగా మాట్లాడడం వెనుక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పైగా విధులకు ఆలస్యంగా వస్తే తప్పేంటి.. అని సిబ్బంది ముందు వ్యాఖ్యానించడం డెయిరీ అభివృద్దికి పాల్పడుతున్న డొల్లతనం బయట పడినట్లయింది. ఈ నెల 15న “బతుకమ్మ” విజయ డెయిరీని  సందర్శించగా, ఉదయం 11 గంటలు దాటినా విధులకు హాజరు కాకపోవడంపై మరునాడు 16న ‘మధ్యాహ్నం రాకడ- సాయంత్రం పోకడ’ కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన డెయిరీ ఎండి, షెడ్ అధికారికి ఫోన్ చేసి వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.

What's wrong with coming to work in the afternoon?

  • అధికారి తీరుపై..

కార్యాలయపరంగా పాలన కొనసాగించాల్సిన శాశ్వత ఉద్యోగులు సమయానికి రావడం లేదు. దీనిని అలుసుగా తీసుకున్న తాత్కాలిక సిబ్బంది సైతం అదే ధోరణిని అవలంబిస్తున్నారు. దీనివల్ల  వివిధ పనుల నిమిత్తం వచ్చే రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు.  ఉద్యోగుల అలసత్వంపై ప్రస్తుతమున్న అధికారిని, డెయిరీ ఎండి ఆరా తీయడంతో సారంగపూర్ లోని  మిల్క్ షెడ్ లో సిబ్బందితో  ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించి, చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఆలస్యంగా వచ్చేవారు, అందులోనూ శాశ్వత ఉద్యోగులకు వంత పాడడం సందేహాలకు తావిస్తోంది.

 

  • ఇంట్లో పనులుంటాయి..

కార్యాలయానికి రావడంలో జరిగిన ఆలస్యంపై సిబ్బంది నుంచి వివరణ తీసుకున్నారు. శాశ్వత ఉద్యోగిని విషయానికొచ్చేసరికి, సార్.. నేను ఉదయం తొమ్మిదింటికే వచ్చానని చెప్పడంతో… పిల్లలుంటారు, ఇంట్లో పనులుంటాయి, ఆలస్యంగా రావడం తప్పేమి గాదని ఉద్యోగికి వత్తాసుగా అధికారి మాట్లాడడం సమావేశంలో చర్చనీయాంశమయ్యింది. ఉదయం 11.10 గంటలకు సైతం కుర్చీలు ఖాళీగా ఉండడం ఫోటోలో స్పష్టంగా కనబడుతున్నా, శాశ్వత ఉద్యోగి చెప్పిన మాటలు నమ్మడం చూస్తే, ఆ అధికారి గతంలో నిజామాబాద్ లోని జైతాపూర్ గ్రామంలో ఒకరి  విషయంలో చేసిన పనులు సిబ్బంది కళ్ళ ముందు గిర్రున తిరిగినట్లయ్యింది.

What's wrong with coming to work in the afternoon?

  • చర్యలకు బదులు ..

విజయ డెయిరీ అంతంతే ఉంది..జీతం తీసుకున్నప్పుడు తమ వంతు బాధ్యతగా సంస్థ అభివృద్ధి కోసం శ్రమిద్దామని చెప్పి, సమయానుకూలంగా విధులు నిర్వహించేలా అధికారి పురమాయించాల్సి ఉంటుంది. అలా గాకుండా పని చేయని వారిపై చర్యలకు బదులు, డెయిరీలో ఒరిగే పనులేమి లేవని, ఇంట్లో పనులు ముఖ్యమని   బాద్యతరాహిత్యంగా మాట్లాడడం ఆ అధికారికే చెల్లినట్లయింది. విధులకు ఆలస్యంగా వచ్చిన, అసలు రాకపోయిన, ఇంటి దగ్గర కూర్చోబెట్టి జీతాలు ఇప్పించేంత గొప్ప మనసు డెయిరీలోని పెద్ద సార్లకు ఉందనే వ్యాఖ్యాలు పాడి రైతుల నుంచి వినబడుతున్నాయి.

What's wrong with coming to work in the afternoon?