కుక్కల బెడద తీరేదెన్నడో..?
చిన్నారులను గాయపరుస్తున్న శునకాలు రోడ్ల మీద ప్రయాణించాలంటే భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు పూర్తి స్ధాయిలో నియంత్రణ చేపట్టని అధికారులు రుద్రూర్, బతుకమ్మ : వీధి కుక్కల బెడద అధికమైంది. కుక్కలు గుంపులు, గుంపులుగా స్వైరవిహారం చేస్తూ చిన్నా పెద్ద అని తేడా లేకుండా దాడి చేస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. దీంతో రోడ్లమీద ప్రయాణించాలంటేనే ప్రజలు భయాబ్రాంతులకు గురవుతున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో కుక్కల బెడద అధికమైంది. ప్రజలు బయటకు వెళ్లాలంటే కుక్కలు ఉండడంతో జంకుతున్నారు. గతంలో గ్రామ...