Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 6:07 pm Posted by : ramakrishna

ఎన్నాల్లీ హత్యల పరంపర ?

 

. . . బార్ కన్నెర్ర

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

 

న్యాయవాదులపై దాడులు, న్యాయవాదుల హత్యలు సమాజానికి క్షేమకరం కాదని… ఒక న్యాయవాదులనే కాకుండా సభ్య సమాజంలో ఎవరి హత్య సమ్మతం కాబోదని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠ రావు అన్నారు. హైదరాబాద్ లో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ కారుతో గుద్ది చంపడం పట్ల న్యాయవాద సమాజం తీవ్ర ఆగ్రహాన్ని, నిరసనను వ్యక్తం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఖాజా హత్య నేపథ్యంలో జిల్లా కోర్టు సముదాయంలోని బార్ సమావేశపు హల్ లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖాజా మొయినుద్దీన్ హత్యపై సమగ్ర నేర విచారణ జరపాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ న్యాయవాదుల హత్యలపై చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నదని ఆయన తెలిపారు. సమావేశంలో పాల్గొన్న న్యాయవాదులందరి ఏకాభిప్రాయం మేరకు సోమవారం కోర్టుల విధులకు దూరంగా ఉండి నిరసన తెలిపినట్లు తెలియజేశారు. సంతాప తీర్మానాన్ని ఖాజా కుటుంబ సభ్యులకు పంపిస్తామని నీలకంఠ రావు తెలిపారు. ఈ సమావేశంలో బార్ ఉపాధ్యాక్షుడు ఆవుల నారాయణ రావు, క్రీడల్ కార్యదర్శి గణేష్, మాజీ పిపి మధుసుధన్ రావు, సీనియర్ న్యాయవాదులు ఆనంద్ రెడ్డి, ఎర్రం గణపతి, అల్గొట్ రవీందర్, రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.