ఆ ఎమ్మెల్యేల భవిష్యత్ ఏమిటో..?

న్యూఢిల్లీ, బతుకమ్మ: పార్టీ ఫిరాయించి ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ లను సుప్రీం కోర్టు నేడు విచారించనుంది. అయితే నిర్ణయం తీసుకునే విషయంలో తాత్సారం కావడంపై ఇటీవల విచారణ సందర్భంగా  అసహనం  వ్యక్తం చేసిన ధర్మాసనం నేటి విచారణ సందర్భంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటానేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసీ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బీఆర్ఎస్ న వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంపై కౌశిక్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్,...