ఆర్ డబ్ల్యూఎస్ లో ఏం జరుగుతోంది?
ఉన్నత స్థాయి అధికారుల వేదింపులే కారణం? ఒత్తిళ్ళతో అధికారులే సతమతం ఉమ్మడి జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా శాఖలో పని చేయలేమంటున్న ఏఈలు రెండు నెలల్లో ఇద్దరు ఏఈల బలవణ్మరాలకు యత్నాలు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా శాఖ (మిషన్ భగీరథ) లో బలవణ్మరనాలు కలవరపెడుతున్నాయి. ప్రభుత్వాధికారులుగా ఐదంకెల జీతంతో దర్జాగా పని చేయాల్సిన అధికారులు ఆత్మ హత్యాయత్నాలకు పాల్పడడం కలకలం రేపుతోంది. జూనియర్లు, సీనియర్లు అంటూ తేడా లేకుండా అధికారులు ఒత్తిళ్ళకు గురవుతున్నారు. తమ పై...