Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 7:43 pm Posted by : ramakrishna

అసలు వ్యవసాయ సహకార సంఘంలో ఏం జరుగుతుంది?…

 

. . . సొసైటీలో పీఎఫ్​ డబ్బులు మాయంపై అసిస్టెంట్​ రిజిష్ర్టార్​ని సిబ్బంది నిలదీత

 

. . . హమాళీ డబ్బులు చెల్లించలేదని సొసైటీకి తాళం

 

రుద్రూర్, బతుకమ్మ : 

 

రుద్రూర్​ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అసలు ఏం జరుగుతుంది?.. అని రైతులు ప్రశ్నించుకుంటున్నారు. సొసైటీలో జరుగుతున్న నిధులు గోల్ మాల్​ గూర్చి ఉన్నతాధికారులకు తెలిసి జరుగుతుందా? లేక తెలియనట్లుగా నటిస్తున్నారా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. యూరియా సరఫరా నుండి హామలీ కూలీల చెల్లింపులతో పాటు సొసైటీ సిబ్బందికి సంబంధించిన ప్రతినెల వారి పేర్ల మీద బ్యాంకుల్లో జమచేసే డబ్బుల వరకు అవకతవకలు జరుగుతున్నప్పటికి కూడా సంబంధిత అధికారులు నోరు మెదకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత రెండు రోజుల క్రితం రుద్రూర్​ సొసైటీకి సరఫరా అయిన యూరియా పంపిణీలో సొసైటీ సెక్రటరీ యూరియా బుకింగ్​ ఆన్​లైన్​ గుప్పుచప్పుడు కాకుండా తనకు సంబంధించిన వారికి ముందస్తుగానే సమాచారం అందించి ఆదివారం మహాశివరాత్రి రోజున ఉదయం యూరియా బుకింగ్​ యాప్​ పెట్టడంతో మిగతా రైతులు యూరియా కోసం సొసైటీకి రాగా అప్పటికే యూరియా స్టాక్​ అయిపోయిందని సైక్రటరీ చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తు సొసైటీ వద్ద ఆందోళన చేసి, సెక్రటరీని నిలదీశారు.

– హమాలీ డబ్బులు చెల్లించాలంటూ అసిస్టెంట్​ రిజిష్ర్టార్​ని సిబ్బంది నిలదీత

రుద్రూర్​ సొసైటీ ఆధ్వర్యంలో ఖరీఫ్​ సీజన్​లో ఏర్పాటు చేసిన ధాన్యం సేకరణలో సందర్బంగా హమాళీల సేవలు వినియోగించుకొని వారికి చెల్లించాల్సిన బకాయి రూ.27 వేలకు గాను కొంత వరకు చెల్లించి సొసైటీ సిబ్బంది చేతులు దులుపుకున్నారని హమాలీ కూలీలు ఆరోపించారు. దీనిలో భాగంగా మంగళవారం హమాళీ కూలీలు రుద్రూర్​ సొసైటీకి చేరుకొని సెక్రటరీని నిలదీశారు. అదేసమయంలో సొసైటీకి వచ్చిన సొసైటీస్​ అసిస్టెంట్​ రిజిష్ర్టార్​ అంబర్​సింగ్​ని నిలదీశారు. కూలీ డబ్బుల కోసం ప్రతినిత్యం సొసైటీకి వచ్చి వెళ్తున్న ఎవరు సమాధానం ఇచ్చేవారే లేరని మాకు రావల్సిన డబ్బులు ఇంకెప్పుడు ఇస్తారాని ఆగ్రహం వ్యక్తం చేస్తు సొసైటీకి తాళం వేశారు. ఇదిలా ఉండగా సొసైటీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సంబంధిచిన  పీఎఫ్​ డబ్బులు వారి ఖాతాల్లో జమచేయకపోవడంతో సిబ్బంది ఆందోళన చేశారు. స్పంధించిన అసిస్టెంట్​ రిజిష్ర్టార్​ అంబర్​సింగ్​ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని పీఎఫ్​ డబ్బులు మీ ఖాతాల్లో జమచేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

 

 

What actually happens in an agricultural cooperative society?...