Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 6:33 pm Posted by : ramakrishna

ఆనాటి నా పల్లె కల ఎటువాయే..!

 

. . . తరతరానికి మారుతున్న పాత పద్ధతులు

 

ఇందల్ వాయి, బతుకమ్మ :

 

ఉగాది పండగ అంటేనే సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. దీనిని అత్యంత పర్వదినంగా, తెలుగు నూతన సంవత్సరంగా తెలుగు ప్రజలు జరుపుకుంటారు. ఉగాది పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని నాటి కాలంలో ఉగాది పండగ రోజు సాయంత్రమైందంటే ఎడ్లబండ్లతో గ్రామ గ్రామాలలో పండగ వాతావరణం తో కిటకిటలాడేవి. పండగ రోజున ఎడ్లకు రంగులు అద్ది, బండ్లను తాటి కొమ్మలతో అలంకరించి, ముస్తాబు చేసి గ్రామాలలో ఉన్న అమ్మవార్ల చుట్టూ ఎడ్ల బండ్లను తింపేవారు. కాలానికి అనుగుణంగా నేటి తరంలో ట్రాక్టర్ లనే ఎడ్ల బండ్లుగా గ్రామాలలో తింపడంతో గతంలో ఉన్న పండగ వాతావరణం అంతగా ప్రజలను ఆకర్షించలేకపోతున్నాయి. ఏది ఏమైనా పాతకాలం జ్ఞాపకాలే మధురం.

 

What a dream of my village that day..!