- వికటించిన కిడ్నీ స్టోన్ ఆపరేషన్..?
- యూరాలజీ డాక్టర్ లేకున్నా..బయటి డాక్టర్ తో ఆపరేషన్..?
- ఇన్ఫెక్షన్ సోకి హైదరాబాద్ యశోద హాస్పిటల్ కు తరలింపు..?
- రోజుకు లక్ష రూపాయల ఖర్చు.. అయినా హామీ ఇవ్వని యశోద డాక్టర్లు..?
- ఆందోళనలో బంధువులు..మంథీని గ్రామస్తులు..
- ఆందోళన కు వచ్చిన గ్రామస్తులతో ఆశ హాస్పిటల్ డాక్టర్ల చర్చలు..?
- ముందస్తుగా హాస్పిటల్ వద్ద పోలీస్ బందోబస్తు..?
ఆర్మూర్, బతుకమ్మ : కిడ్నీ స్టోన్ ఆపరేషన్ వికటించి హైదరాబాద్ యశోద ఆసుపత్రి పాలైన ఘటన ఆర్మూర్ పెర్కిట్ లో ఉన్న ఆశ హాస్పిటల్ లో జరిగింది. వివరాలలోకి వెళితే ఆర్మూర్ మండలం లోని మంథని గ్రామానికి చెందిన బ్రాహ్మణపల్లి చిన్నారెడ్డి (45) కిడ్నీ స్టోన్ తో బాధపడుతున్నాడు. బంధువులు చిన్నారెడ్డిని గత నెలలో వైద్యం కోసం ఆశ హాస్పిటల్కు తీసుకొచ్చారు. డాక్టర్లు పరీక్షించి ఆపరేషన్ చేయాలని సూచించారు. ఆశ హాస్పిటల్ లో యూరాలజీ డాక్టర్లు అందుబాటులో లేకున్నా నిజామాబాద్ లోని మరొక డాక్టర్ తో ఓపెన్ సర్జరీ చేసి ఆపరేషన్ బాగా జరిగిందని డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయిన మూడు రోజులకు విపరీతమైన జ్వరం రావడంతో మళ్లీ ఆశా హాస్పిటల్ కు తీసుకువచ్చారు. ఇన్ఫెక్షన్ అయ్యిందని హైదరాబాదులోని యశోద హాస్పిటల్కు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు.. యశోదలో రోజుకు లక్ష అవుతున్న డాక్టర్లు చిన్నారెడ్డి ప్రాణానికి హామీ ఇవ్వడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

- ఆశ డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం..?
కిడ్నీ స్టోన్ ఆపరేషన్ చేసే యూరాలజీ డాక్టర్ లేరని చెప్పిన మరో హాస్పిటల్కు తీసుకువెళ్లే వాళ్ళమని. మూత్రపిండాన్ని యాక్సెస్ చేయడానికి చిన్న కోత చేసి సన్నని టెలిస్కోప్ పరికరం అయినా నెఫ్రో స్కోప్ కోత ద్వారా మూత్రపిండంలోకి పంపి రాయిని బయటకు తీస్తారు. లేదా చిన్న ముక్కలుగా చేసి బయటికి తీస్తారు. ఇలా కాకుండా ఓపెన్ సర్జరీ చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆందోళనకు వచ్చిన మంథని గ్రామస్తులతో ఆశ హాస్పిటల్ డాక్టర్లు చర్చలు జరుపుతున్నారు. రోజుకు లక్ష ఖర్చు పెట్టేంత ఆర్థిక స్తోమత లేని బ్రాహ్మణపల్లి చిన్నారెడ్డికి న్యాయం చేయాలని బంధువులు.. గ్రామస్తులు కోరుతున్నారు.
- ఎంతమంది డాక్టర్లకు పట్టాలు ఉన్నాయి..?
ఆశా హాస్పిటల్ లో చిన్నారెడ్డి కిడ్నీ ఆపరేషన్ వికటించడమే కాదు.. అంతకుముందు ఇలాంటి సంఘటనలు జరిగాయని.. గతంలో సిబ్బంది రోగులపై రౌడీల్లాగా దాడి చేసిన సంఘటనలు ఉన్నాయని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆశాలో పనిచేసే డాక్టర్లలో ఎంత మందికి డాక్టర్ల పట్టాలు ఉన్నాయో..? పట్టాలు పొందిన వారు ఎంతమంది ఉన్నారో జిల్లా వైద్యశాఖ అధికారులు.. లేదా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) డాక్టర్లు తనిఖీలు చేయాలని రోగులు.. ప్రజలు కోరుతున్నారు.
