తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి
కలెక్టర్ కు బీజేపీ ఆధ్వర్యంలో వినతి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాల వల్ల తడిసిన,రంగు మారిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి, నష్టపోయిన రైతులకు తగిన సహాయం అందించాలని బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో లక్షల ఎకరాల్లో కోసిన వరి పంటను రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమవడం, ప్రారంభమైన కేంద్రాల్లో కూడా వడ్ల కుప్పలు లేపకపోవడం వలన, ఇటీవలి భారీ వర్షాల...