తడి, పొడి చెత్తను మున్సిపల్ వాహనాల్లోనే వెయ్యాలి
కమిషనర్ గోపు గంగాధర్ భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మున్సిపల్ పరిధిలోని ప్రజలందరూ తమ తమ ఇంట్లో రోజువారి చెత్తను విడివిడిగా తడి, పొడి చెత్తను మున్సిపల్ చెత్త వాహనంలోనే వెయ్యాలని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ పట్టణ ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 100 రోజుల కార్యక్రమం లో భాగంగా బుధవారం పట్టణం లోని నాలుగో వార్డు లోని కూరగాయల హనుమాన్ గుడి ప్రాంతంలో చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ...