- కమిషనర్ గోపు గంగాధర్
భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మున్సిపల్ పరిధిలోని ప్రజలందరూ తమ తమ ఇంట్లో రోజువారి చెత్తను విడివిడిగా తడి, పొడి చెత్తను మున్సిపల్ చెత్త వాహనంలోనే వెయ్యాలని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ పట్టణ ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 100 రోజుల కార్యక్రమం లో భాగంగా బుధవారం పట్టణం లోని నాలుగో వార్డు లోని కూరగాయల హనుమాన్ గుడి ప్రాంతంలో చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారావేయవద్దని తెలిపారు. వార్డు ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. అనంతరం ఇంటి చెత్తను బయట ఎక్కడపడితే అక్కడ వేయవద్దని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్, మెప్మా సిబ్బంది, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.