Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 January 2025, 3:55 pm Posted by : ramakrishna

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు

బతుకమ్మ భిక్కనూరు: సంక్షేమ పథకాల ద్వారా అర్హులందరికీ లబ్ధిచేకూర్చడమే ధ్యేయంగా ప్రభుత్వ పాలన గ్రామసభ నిర్వహిస్తుందని ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి వెల్లడించారు.గురువారం గ్రామసభ లో భాగంగా ఎంపీడీవో మాట్లాడుతూ రైతు భరోసా, రేషన్ కార్డులు,  ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల కింద లబ్ధి పొందేందుకు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా పథకాల కింద అర్హులుగా గుర్తించబడిన వారి ముసాయిదా జాబితాను గ్రామ సభలో అందరి సమక్షంలో చదివి వినిపించారు. జాబితాలో లేని వారి నుండి ఆర్జీలను స్వీకరించారు. అర్హులు కాని వారిని జాబితాలో నుంచి తీసివేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Welfare schemes for everyone who is eligible