Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 August 2024, 5:24 pm Posted by : ramakrishna

పర్వతారోహకుడికి ఘన స్వాగతం

బతుకమ్మ, బోధన్: ఈ నెల 17 వ తేదీన రష్యా లోని మౌంట్ ఎల్బర్స్ పర్వతం అధిరోహించిన నవీపేట్ మండలంలోని నాలేశ్వర్ కు చెందిన పర్వతారోహకుడు ఆర్ముర్ మారుతి కి గ్రామ ప్రజలు, యువకులు బ్యాండ్, మేళతాలలతో స్వాగతం పలికారు. తదనంతరం సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాండ్లు, వివేకానంద యూత్, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ గతంలో కిలిమంజారో పర్వతం అధిరోహించానని, ఇప్పుడు ఎల్బర్స్ ను పూర్తిచేశానని చెప్పాడు. ఎవరెస్టు అధిరోహించడమే తన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ తో, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Welcome to the mountaineer