Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 January 2025, 2:08 pm Posted by : ramakrishna

దీపాదాస్ మున్షి, మహేశ్ గౌడ్ కు ఘనస్వాగతం

ఆర్మూర్, బతుకమ్మ: ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ర్ట ఇన్ చార్జి దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ కు ఆర్మూర్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజాపాలన మొదటి వార్షికోత్సవాలు తదితర  అంశాలపై వారు నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. అనంతరం ఆదిలాబాద్ కు బయల్దేరి వెళ్లారు.