Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 August 2025, 8:35 pm Posted by : ramakrishna

ప్రతి బూత్ బీజేపీ బూత్ చేయడమే లక్ష్యంగా పని చేస్తాం

  • బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావుని రాష్ట్ర కార్యాలయం లో నిజామాబాదు జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ రాష్ట్ర అధ్యక్షులు తో రాంచందర్ రావు తో జిల్లాలో పార్టీ కార్యక్రమాలపైన చర్చలు జరిపారు. జిల్లా కమిటీ బలోపేతం, బూత్ స్థాయి వరకు పార్టీ విస్తరణ, ప్రతి గ్రామంలో కార్యకర్తల నెట్‌వర్క్ నిర్మాణం, యువతలో జాతీయవాద భావజాలాన్ని పెంపొందించడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేర్చడం, ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయ చర్యలు, స్థానిక సంస్థల నిర్మాణం వంటి అంశాలపై సమాలోచనలు జరిపినట్టు తెలిపారు. ప్రతి బూత్ – బీజేపీ బూత్ చేయడమే లక్ష్యంగా పని చేస్తామని రాష్ట్ర అధ్యక్షులు కు తెలిపినట్టు అన్నారు.  ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతం కు కృషి చేస్తూ, పార్టీ జెండాను గ్రామం నుంచి పట్టణం, జిల్లా వరకు ఎగరేయాలని రాష్ట్ర అధ్యక్షులు సూచించినట్టు దినేష్ పటేల్ కులాచారి అన్నారు.