Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 7:59 pm Posted by : ramakrishna

ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించే వరకు కృషి చేస్తాం

 

. . . టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్

 

. . . చాగంటి పద్మావతికి పదవి విరమణ సన్మాన కార్యక్రమం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పదవి విరమణ పొందుతున్న డీఆర్డీఎ శాఖ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం లేకపోవడం శోచనీయమని, వారికి పెన్షన్ సౌకర్యం కల్పించే వరకు కృషి చేస్తానని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. సోమవారం ఐడీవోసి కార్యాలయం లో డీఆర్డీఎ శాఖ ఆధ్వర్యంలో చాగంటి పద్మావతి పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి టీఎన్జీవోస్ పక్షాన ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో పారదర్శకమైన సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా బోనాలు, బతుకమ్మ వేడుకలకు అందించే సేవలను కొనియాడారు. నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచిన చాగంటి పద్మావతి రమేష్ బాబు లకి హృదయపూర్వకంగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. డీఆర్డీఎ శాఖ ఉద్యోగుల సమస్యలన్నింటిని సదరు శాఖ అధికారులతో సమన్వయపరచుకొని, పరిష్కరించుకుంటున్నప్పటికిని, పదవి విరమణ పొందుతున్న ఉద్యోగులకు, పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఉత్తర్వులు ఉన్నప్పటికిని, వాటికి సంబంధించిన సరియైన మార్గదర్శకాలు లేవని వాపోయారు. ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి SM.హుస్సేని (ముజీబ్) ల సహకారంతో ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన తెలిపారు. అనంతరం టీఎన్జీవో పక్షాన పద్మావతి – రమేష్ బాబు దంపతులను శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు జాఫర్ హుస్సేన్, మాణిక్యం, అర్బన్ యూనిట్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, జిల్లా మహిళా సంయుక్త కార్యదర్శి ఇందిర, జిల్లా కార్యవర్గ సభ్యులు రవి, సదురు శాఖ ఉద్యోగులు, ఆత్మీయ బంధువర్గం హాజరై శుభాకాంక్షలు తెలిపారు.