Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 May 2025, 10:44 am Posted by : ramakrishna

పద్మశాలి సంఘం అభివృద్ధికి కృషి చేస్తా

మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాను కలిసిన పద్మశాలి సంఘం నగర నూతన కార్యవర్గ సభ్యులు

నిజామాబాద్, బతుకమ్మ : పద్మశాలి సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని  నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు.  ఇటీవల ఎన్నికైన పద్మశాలి సంఘం నగర నూతన అధ్యక్షులు పెంట దత్తాద్రి, కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాను మర్యదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా గణేశ్ గుప్తా నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి  శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఎనుగందుల మురళి, కన్న దుబ్బరాజ,బాగుల శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి చౌటి భూమేశ్వర్ ,కార్యదర్శులు అవధూత రాములు,ఎనుగందుల  సుభాష్ ,భూసరవి,కోశాధికారి మోర సాయిలు,ప్రచార కార్యదర్శి బూస శ్రీనివాస్ ,కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి గంగరాజు మరియు కులసంఘం నాయకులు సత్యపాల్,బిల్లా మహేష్,భాస్కర్ తదితరులున్నారు.