- అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫిజియోథెరపీ భవన నిర్మాణానికి కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రగతినగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన వరల్డ్ ఫిజియోథెరపీ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు “ఆధునిక జీవన శైలిలో ఫిజియోథెరపీ అత్యంత అవసరమైన వైద్య సేవగా మారిందన్నారు. ఫిజియోథెరపిస్టులు అందిస్తున్న సేవలు అభినందనీయం,” అని పేర్కొన్నారు. 2025, ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం యొక్క థీమ్ ” ఆరోగ్యకరమైన వృద్ధాప్యం “, ఇది బలహీనత మరియు పడిపోవడాన్ని నివారించడంపై ప్రత్యేక దృష్టి పెడుతుందని దీని చేరే దిశగా మరింత సేవలు అందించాలని అన్నారు. ఫిజియోథెరపీ డాక్టర్లను & విద్యార్థుల కార్యకలాపాలను మరింత ప్రోత్సహించే దిశగా ఇందూర్ నగరంలో సొంత భవనానికి తన వంతు సహకారం అందిస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు డాక్టర్ జి శివ కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి ప్రమోద్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బి సందీప్ కుమార్, డా. ఎం.కీర్తి, డా. అశ్విని జోషి, డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఫిజియోథెరపీ డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.
