చక్కెర ఫ్యాక్టరీని తెరిపించే దిశగా పనిచేస్తాం
రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో చక్కెర పరిశ్రమ తిరిగి ప్రారంభమయ్యేలా కృషి చేస్తామని రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ హామీ ఇచారు. సారంగాపూర్ లోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన రైతు సదస్సులో గడుగు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి అని, ఏడాది కాలంలో వ్యవసాయానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. రైతు రుణమాఫీ, సన్నాలకు బోనస్, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ...