- చైర్మన్ శబదం రెడ్డి
బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల పరిధిలోని చిల్లరిగి సొసైటీ పరిధిలోని రాంపూర్ సొసైటీలో గురువారం నిర్వహించిన మహాజనసభలో చైర్మన్ శబదం రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సీజన్లో జొన్నలు రైతులు ఎక్కువ పండించినందుకు ఎకరానికి 20 కింటల చొప్పున కొనుగోలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అందుగ్గాను ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు తో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. మార్చ్ 31 లోగా ఏకకాల రుణాలను రైతులు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, రైతులు అన్నారం వెంకటరామిరెడ్డి, సూరత్వంత్ రెడ్డి, రాంపూర్ మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నర్సా గౌడ్, హనుమంత్ రెడ్డి, డైరెక్టర్లు, సొసైటీ కార్యదర్శి సంతోష్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.