ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శనివారం ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఇటీవల ఎమ్మెల్సీలుగా ప్రమాణం స్వీకారం చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమురయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని,...