Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 April 2025, 5:34 pm Posted by : ramakrishna

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

  • ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శనివారం ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఇటీవల ఎమ్మెల్సీలుగా ప్రమాణం స్వీకారం చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమురయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని, ఉపాధ్యాయులు కోసం జిల్లా కేంద్రంలో త్వరలో ఆఫీస్ ఏర్పాటు చేస్తానని అన్నారు.  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిందని, వెంటనే పెండింగ్ లో ఉన్న 5 డిఏ లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పి ఆర్ సి అమలు చేయాలని, వేసవి సెలవులలో బదిలీలు ప్రమోషన్లు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీ మేరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్షి రాఘవాపురం గోపాలకృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షులు కంచరి రవికుమార్, కొట్టాల రామకృష్ణ, అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు,బిసిటియు మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, గౌరవ సలహాదారులు రమణ స్వామి,గంగోనె సంజీవ్, సతీష్, గంగయ్య, సత్యనారాయణ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

We will work to resolve the problems of teachers.