. . . ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ గా కవితా రెడ్డి బాధ్యతల స్వీకరణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రజారోగ్య పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందేలా కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతానని ప్రముఖ వైద్యురాలు కవితారెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన కవితారెడ్డి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మెన్ గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థ కార్యాలయంలో డాక్టర్ కవితారెడ్డి చైర్మెన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కవితారెడ్డి మాట్లాడుతూ తనను ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మెన్ గా నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు అందుకు కృషి చేసిన పీసీసీ అధ్యక్షుడు బొమ్మా మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్‌స్టిట్యూట్ ను మరింత అభివృద్ధి చేస్తానని డాక్టర్ కవితారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు ఆకుల లలిత, ఈరవత్రి అనిల్, ఉర్దూ అకాడమి చైర్మెన్ తాహెర్ బిన్ హుందాన్, సహకార యూనియన్ చైర్మెన్ మోహన్ రెడ్డి, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, రామర్థి గోపి, భక్తవత్సలం, కాకతీయ సంస్థల చైర్మెన్ రజనీకాంత్, ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పాల్గుణ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య తదితరులు డాక్టర్ కవితారెడ్డిని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.