Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 February 2026, 6:58 pm Posted by : ramakrishna

అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తా

 

. . . బీఆర్ఎస్ అభ్యర్థి ప్యాట విజయలక్ష్మి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ

 

ఒక్కసారి నన్ను గెలిపించి కార్పొరేషన్ కు పంపిస్తే డివిజన్ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి ప్యాట విజయలక్ష్మి అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా నగరంలో 37వ డివిజన్ లో విజయలక్ష్మి విస్తృతంగా ప్రచారం చేశారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే 37 వ డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. డివిజన్లో అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల కు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒక్కసారి అవకాశం కల్పించి గెలిపిస్తే డ్రైనేజీ, రోడ్లు, మంచినీటి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్యాట సంతోష్, లకిడి బాపూరావు, వినోద్, నరేష్, రవి తదితరులు పాల్గొన్నారు.

 

We will work tirelessly for development.