Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 10:04 pm Posted by : ramakrishna

ప్రభుత్వం తరపున రావాల్సిన పరిహారం కోసం కృషి చేస్తా

 

. . . కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి పట్టణంలో మొన్న రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల నష్టపోయిన మొత్తం లో బాధితులకు ప్రభుత్వం తరుపున రావాల్సిన పరిహారం కోసం తన వంతు కృషి చేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. పాత బస్టాండ్ వద్ద ప్రమాదంలో కాలిపోయిన పూల, పండ్ల దుకాణాలను సోమవారం కౌన్సిలర్ల బృందంతో పరిశీలించి, వ్యాపారస్థులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వ్యాపారస్తులతో మాట్లాడుతూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల దుకాణాలు కాలిపోవడం దురదృష్టకరం అని, వ్యాపారస్థులు వ్యాపార సామాగ్రి, దుకాణం నిర్మాణం మొత్తం నష్టపోయారని అన్నారు. అక్కడ ఉన్న 22 దుకాణ దారుల వివరాలు పూర్తి సమాచారం ఇవ్వాలని, వారికి సాధ్యమైనంత తొందరగా ప్రభుత్వం తరుపున తిరిగి నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు. అంత లోపు కాలిపోయిన వస్తువులను అన్నింటినీ తీసేసి స్థలం చదును చేయాలని సూచించారు.

 

We will work on behalf of the government to obtain the compensation due.