Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 February 2025, 4:18 pm Posted by : ramakrishna

బీసీ బిడ్డల గెలుపునకు కృషి చేస్తా

  • ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
  • స్వతంత్ర అభ్యర్థిగా పూల రవీందర్ నామినేషన్

 

నల్గొండ, బతుకమ్మ : బీసీ బిడ్డల గెలుపునకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎన్నికల నామినేషన్లలో భాంగా స్వతంత్ర అభ్యర్తి గా మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ సోమవారం  నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. మిగతా నలుగురు వాళ్లకు వాళ్లు ఓట్లు వేసుకున్న వాళ్లకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు.  పూల రవీందర్, సుందర్ రాజ్ యాదవ్ కు బీసీ ఓట్లు వేసుకున్న బంపర్ మెజారిటీతో గెలుస్తామని తెలిపారు. శ్రీపాల్ రెడ్డి ఉపాధ్యాయులకు సంబంధించిన 400 గజాల ప్లాట్లు అక్రమంగా అమ్ముకున్నారని, వాటి వివరాలు బయటపెట్టానని తెలిపారు. ఎమ్మెల్సీ పదవులేమో మీ అగ్రకులాలకు ఇచ్చి అధ్యక్ష పదవులను మా బీసీ లకు ఇస్తామని మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  వరంగల్, మిర్యాలగూడ నే కాకుండా తెలంగాణలో అన్ని జిల్లాలో బీసీ సభలు పెట్టబోతున్నామని తెలిపారు. బీసీ లందరినీ ఏకం చేయడానికి సభలు ర్యాలీలు అవసరమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన షోకాస్ నోటీసును తాను పట్టించుకోనని అన్నారు. బీసీ ఉద్యమాన్ని అణచివేయడానికి ఓ వర్గం చేస్తున్న కుట్రని ఈ షోకాస్ నోటీసులు అని తెలిపారు.  మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్సీగా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడం కోసమే పని చేశానని తెలిపారు. తెలంగాణ ఉద్యమం మొదలుకొని ప్రత్యేక రాష్ట్రంలోనూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి  కృషి చేశానన్నారు. పి ఆర్ టి యు సంఘానికి తాను చేసిన సేవలను కొంతమంది గుర్తింపు లేకుండా చేశారని కానీ ఉపాధ్యాయుల మనసులో తానున్నానని అన్నారు.

We will work for the victory of BC children