మహిళాసంఘాలు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాయి
సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : మహిళల ఓట్లతోనే రెండో సారి గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలే దేశానికి ఆదర్శమని, కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనేదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ లో వీహబ్ వుమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి మాట్లాడారు. మహిళాసంఘాలు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాయన్నారు. కార్పొరేట్ కంపెనీలకు డబ్బులు ఇస్తే తీసుకొని పలువురు దేశం విడిచి పారిపోతున్నారని విమర్శించారు. మహిళలకు ఇచ్చే ప్రతి రూపాయి వడ్డీతో సహా చెల్లిస్తున్నారని సీఎం పేర్కొన్నారు. సెర్ప్ సభ్యుల సంఖ్యను కోటి మందికి చేర్చాలని సూచించారు. ఈనెల 21 ఇందిరా మహిళ స్టాళ్లను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిస్తారన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణను మహిళలకే అప్పగించామన్నారు.