Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 5:54 pm Posted by : ramakrishna

రాబోయే రోజుల్లో పోచారం ను గద్దె దించుతాం

 

– మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్…

రుద్రూర్, బతుకమ్మ :

రాబోయే రోజుల్లో బాన్సువాడ నియోజకవర్గం గడ్డ మీద తప్పకుండా గులాబీ జెండా ఎగరవేస్తామని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ స్పష్టం చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాన్సువాడ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందించారని గుర్తు చేశారు. అధికారం కోసమే ఎమ్మెల్యే పోచారం పార్టీ ఫిరాయించారని, పోచారాన్ని గద్దె దించే సమయం దగ్గర్లోనే ఉందని ఆయన విమర్శించారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆగన్న, హన్మంత్ షిండే, ఎమ్మెల్సీ విజీ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గాండ్ల మధు, నాయకులు దౌర్ సాయిలు, బొట్టే గజేందర్, కొత్తపల్లి రవి కిరణ్, సిరిగిరి శేఖర్, పార్వతి ప్రవీణ్, కన్నె ప్రవీణ్, నరేందర్, శివ, ల్యాబ్ శేఖర్, కోటగిరి, పోతంగల్, రుద్రూర్ మండలం బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

We will unseat Pocharam in the coming days