… మాజీమంత్రి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ
భిక్కనూరు, బతుకమ్మ :
అకాల వర్షానికి నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ హామీ ఇచ్చారు. భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో అకాల వర్షానికి దెబ్బతిన్న వరి పంటను గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా షబ్బీర్ అలీ రైతులతో మాట్లాడి వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పెద్ద మల్లారెడ్డి గ్రామంలో వందల ఎకరాల్లో అకాల వర్షానికి పంట దెబ్బతిన్నదని వారిని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఈ విషయాన్ని తానే స్వయంగా సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అనంతరం భిక్కనూరు పట్టణంలో సిసి రోడ్లు అంగన్వాడి భవన నిర్మాణాలకు ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్ధం ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ భిక్కనూరు మండల అధ్యక్షుడు తిరుపారి భీమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్, భిక్కనూరు గ్రామ సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్, సర్పంచులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీపీ, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
