Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 December 2024, 7:17 pm Posted by : ramakrishna

బాపూజీ వచనాలయానికి సహకరిస్తాం 

బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి 

నిజామాబాద్ అర్బన్,బతుకమ్మ :   నిజామాబాదు నగరం లో బాపూజీ వచనాలయ ఎన్నికలలో గెలుపొందిన నూతన కమిటీ సభ్యులు బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణను మర్యాద పూర్వకంగా కలసి సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బాపూజీ వచనాలయ ఎన్నికలల్లో గెలపొందిన  అందరికి శుభాకాంక్షలు తెలిపారు. బాపూజీ వచనాలయాని కి ఏ అవసరం  ఉన్న సంప్రదించాలని అండగా ఉంటామని అన్నారు. విద్యార్థుల కు అండగ నిలబడి వారికీ కనీస వసుతులు కల్పించాలని కోరారు. అవసరమైన ప్రభుత్వ నిధులు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా అధ్యక్షులు గడ్డం భక్తవత్సలం మాట్లాడుతూ మీ సహాయ సహకారాలు ఉండాలని బాపూజీ వచనాలయానికి తెలంగాణ లోనే కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి అగ్రగామి ఉంచుతామని అన్నారు. నిజామాబాదు లో అన్ని రాజకీయ నాయకుల ని కలుపుకొని అభివృద్ధి చేస్తామని అన్నారు. మీ అందరి మద్దతు ఉంచి విద్యార్థుల భవిష్యత్తు కోసం అన్ని సౌకర్యాలు కల్పించి బుక్స్ ని నూతన భవాననికి మీ వంతు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో కార్యదర్శి మీసాల సుధాకర్ రావు, కోశాధికారి బి. గంగాధర్ రావు, ఉపధ్యక్షలు భవంతి దేవిదాస్, సంయుక్త కార్యదర్శి ఏఎస్, సాంబయ్య,సభ్యులు లక్కం రెడ్డి, కోవూరు జగన్, ప్రతాప్ రుద్ర,మహిపాల్ రెడ్డి,పుల్గం హనుమండ్లు,అరేట్టి లక్ష్మి నారాయణ,ఆమందు విజయ్, పాటి అనిల్ రెడ్డి,గోవింద్ ప్రసాద్ జవర్,తదితరులు పాల్గొన్నారు.

We will support Bapuji Vachanalayam