ప్రజాభిప్రాయానికి అనుగుణంగా సమగ్ర నివేదిక సమర్పిస్తాం

బీసీ డేడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు వెల్లడి స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల దామాషాపై విజ్ఞాపనలు స్వీకరణ నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల నుండి అభ్యర్థనలు స్వీకరించేందుకు వీలుగా ఏర్పాటైన బీసీ డెడికేటెడ్ కమిషన్ గురువారం నిజామాబాద్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిజామాబాద్ ఉమ్మడి (నిజామాబాద్, కామారెడ్డి) జిల్లాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు, కార్యదర్శి బి.సైదులు ఆయా...