Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 September 2025, 3:54 pm Posted by : ramakrishna

శాంతి స్థాపనకు అండగా ఉంటాం..

వెబ్ న్యూస్, బతుకమ్మ :  నేపాల్ లో  శాంతి స్థాపనకు భారత్ అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఈమేరకు తాత్కాలిక ప్రభుత్వ ప్రధానిగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా  కార్కీతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. ఈసంభాషణకు సంబంధించిన విషయాలను మోదీ ’ఎక్స్‘ వేదికగా పంచుకున్నారు. కాగా, నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి వ్యతిరేక నిరసనలతో కొన్ని రోజులు క్రితం దారుణంగా ఉన్న పరిస్థితులు ప్రస్తుతం కుదుటపడ్డాయి.