Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 8:22 pm Posted by : ramakrishna

రైతులకు అండగా ఉంటాం

 

. . . మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

 

లింగంపేట, బతుకమ్మ :

 

రాష్ట్ర ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూర్, జలాల్పూర్ గ్రామాలలో శుక్రవారం ఆయన పర్యటించారు. గ్రామాల్లో గత 2 నెలల క్రితం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు పడుతున్న అవస్థల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కాలయాపన, నిర్లక్ష్యం కారణంగా ధాన్యం కొనుగోలు సకాలంలో కొనసాగడం లేదన్నారు. ధాన్యం తూకం వేయడంతో పాటు తరలింపులో జాప్యం జరగడం వల్ల అకాల వర్షాలు కురిసి ధాన్యం తడిసిపోతుందన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వస్తున్న పట్టించుకునే నాథుడు కరువయ్యారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తరలింపులు జరుగుతున్న జాప్యం పట్ల నిరసన వ్యక్తం చేశారు రైతులకు అండగా నిలిచి ధాన్యం తరలించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.