– కామారెడ్డి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్
కామారెడ్డి, బతుకమ్మ : రాబోవు వేసవి కాలానికి విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా అన్ని రకాల నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కామారెడ్డి సర్కిల్ సూపరిండెంట్ ఇంజనీర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా
ఇందులో భాగంగా గత వేసవి కాలం డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని, రాబోయే వేసవిలో పెరగబోయే డిమాండ్ అంచనా మేరకు ప్రణాళిక బద్ధంగా అంచనాలు సిద్ధం చేసి సమయానుగుణంగా తగిన మంజూరును తీసుకుని, కొత్తగా 03 నెంబర్ 5 ఎం వి ఏ, 01 నెంబర్. 3.15 ఎంవిఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ల(పిటిఆర్) ఏర్పాటుకు మరియు 33/11 సబ్ స్టేషన్ లలోని 02 నెంబర్ల పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్ధ్యాన్ని పెంచడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. గడచిన సంవత్సర కాలంలో గరిష్ట డిమాండ్ ఉన్న సమయంలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మల(డి టి ఆర్)పై లోడ్ భారం ఎంత ఉందో టాంగ్ టెస్టర్ రీడింగ్ తీసుకొని అందుకు అనుగుణంగా కొత్తగా 70 no’s ట్రాన్స్ఫార్మర్లు అమర్చడం జరుగుతుందని , లోడ్ మేరకు 59 నెంబర్ల ట్రాన్స్ఫార్మర్ల సామర్ధ్యాన్ని పెంచుతున్నామన్నారు.
మెరుగైన , నాణ్యమైన, విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా అందించడానికి 33 కేవీ ఇంటర్ లింకింగ్ లైన్స్ వ్యవస్థను పటిష్టపరిస్తూ ప్రతి ఒక్క 33/11 కేవీ సబ్ స్టేషన్ కు అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి అవసరమైన పనులు పూర్తి చేస్తున్నామన్నారు. ఓవర్ లోడ్ ఉన్న 33 కెవి , 11 కెవి ఫీడర్లను గుర్తించి అందుకు అనుగుణంగా లోడ్ రిలీఫ్ చేయడానికి లోడ్ బదలాయింపు చేస్తున్నామని తద్వారా లోడ్ భారం తగ్గి నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుందని వివరించారు. మున్సిపాలిటీ టౌన్ లలో విద్యుత్ అంతరాయాలు సంభవించినప్పుడు అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా అందించడానికి రింగ్ మెయిన్స్ వ్యవస్థను పటిష్ట పరుస్తూ, 11కేవీ ఫీడర్లకు అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఫీడర్ల ద్వారా విద్యుత్ వినియోగదారులకు అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నామని వివరించారు. నిర్దిష్టమైన కార్యాచరణ ద్వారా 33 కేవీ మరియు 11కేవీ ఫీడర్లలోని లోపాలను ముందస్తుగా గుర్తిస్తూ తగిన నిర్వహణ కార్యక్రమాలు చేపడుతూ అంతరాయాలు లేని విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇదే విధానాన్ని అనుసరిస్తూ ఎప్పటికప్పుడు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల(డి టి ఆర్)నిర్వహణ కార్యక్రమాలు చేపట్టి విద్యుత్ అంతరాయాలను గణనీయంగా తగ్గించామని తెలియజేశారు. పైన తెలిపిన విధంగా ట్రాన్స్ఫార్మల(డి టి ఆర్) 514 నెంబర్ల నిర్వహణను చేపట్టడం జరిగిందని వివరించారు . అలాగే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మల సామర్ధ్యాన్ని పెంచడం వలన చాల వరకు ఓవర్ లోడ్ వలన జరిగే విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గించగలిగామని అన్నారు. 33/11కేవీ సబ్ స్టేషన్లలో ఓకే విసిబి పై గల 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో గల 11 కేవీ ఫీడర్లను ప్రత్యేక కార్యాచరణ ద్వారా బయ్య్ ఎక్సటెన్షన్/ ప్రత్యేకమైన సర్క్యూట్ బ్రేకర్ (వి సి బి) ద్వారా వేరుచేయడం వలన మరింత మెరుగైన విద్యుత్ సరఫరా వినియోగదారులకు అందుతుందని తెలిపారు. గడచిన కాలానికి జరిగిన అంతరాయాలు (బ్రేక్ డౌన్ల) లను సాంకేతికంగా విశ్లేషించి, వాటి ఆధారంగా బ్రేక్ డౌన్ రెక్టిఫికేషన్ టీం లను నియమిస్తున్నామని వివరించారు . అత్యవసర సర్వీసులో భాగమైన ఆసుపత్రి , మెడికల్ కాలేజీలు , పోలీస్ స్టేషన్లు లకు అత్యవసర పరిస్థితుల్లో, ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పైన వివరించిన విధంగా వివిధ నిర్దిష్టమైన కార్యాచరణ ద్వారా గత వేసవిలో ఎదుర్కున్న ఇబ్బందులను పరిగణాలకు తీసుకొని వచ్చే వేసవిలో వినియోగదారులకు మరింత మెరుగైన , నాణ్యమైన, విద్యుత్ సరఫరా అందించడానికి నిబద్దతతో టీజీఎన్ పీడీసీఎల్ లోని ప్రతి ఒక్క ఉద్యోగి కంకణ బద్ధులై పని చేస్తున్నామని పేర్కొన్నారు .