Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 5:23 pm Posted by : ramakrishna

బాల్ బ్యాడ్మింటన్‌కు పూర్వ వైభవం తీసుకొస్తాం

 

. . . బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లాలో బాల్ బ్యాడ్మింటన్ క్రీడకు పూర్వ వైభవం తీసుకురావడమే సంఘం లక్ష్యమని జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్ తెలిపారు. 72వ తెలంగాణ రాష్ట్ర సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ షిప్‌ కు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పురుషుల, మహిళల జట్ల ఎంపిక ప్రక్రియను జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు ఎంపికలకు హాజరయ్యారు. ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 7 నుంచి 9 వరకు మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న 72వ తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబర్చి పతకాలు సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపికైన క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించి, ప్రతిభ ఆధారంగా తుది జట్టును ప్రకటిస్తామని వెల్లడించారు. ఎంపిక కార్యక్రమంలో జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు, కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.

 

We will restore the past glory of ball badminton.