Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 July 2025, 3:08 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ హయాంలో అర్హులందరికీ ఇళ్లిస్తాం

రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

మల్కాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన

నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ హయాంలో అర్హులందరికీ ఇళ్లిస్తామని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. శుక్రవారం రూరల్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. రూరల్ నియోజక వర్గంలో 100 శాతం ఇళ్ల నిర్మాణాల జరుగుతున్నాయన్నారు.  ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఇల్లు నిర్మించుకుంటున్నారన్నారు.  ఇందిరమ్మ ఇళ్లపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారమన్నారు. దాదాపు అందరికి రెండు విడతల బిల్లులు మంజూరు అయ్యాయన్నారు.  అవినీతిలో కురుకుపోయిన బీఆర్ ఎస్ కు రేవంత్ సర్కార్ ను విమర్శించే స్థాయి లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్కాం, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్..ఇలా అన్ని స్కీముల్లో కేసీఆర్ కుటుంబం దోషులుగా ఉన్నారని ఆరోపించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.