ఇంజనీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం
వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు అధ్యాపకుల పరిచయ కార్యక్రమానికి ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి అధ్యక్షత వహించగా వైస్- ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్ టి.యాదగిరిరావు మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయం లో ఇంజనీరింగ్ కళాశాల సుదీర్ఘ స్వప్నమని పేర్కొన్నారు. ఈ స్వప్నాన్ని ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు, విద్యావంతుల, మీడియా మిత్రుల కోరిక మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్...