Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 October 2024, 2:35 pm Posted by : ramakrishna

‘కస్తూర్బా’లో సౌకర్యాలు కల్పిస్తాం

భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. కస్తూర్బా బాలికల పాఠశాలను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. గత ప్రభుత్వ హయాంలో భీమ్ గల్ కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, అలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చూస్తామన్నారు. పాఠశాలకు విశాలమైన మైదానం ఉన్నప్పటికీ, లెవెల్ గా లేదన్నారు. పాఠశాలలో డైనింగ్ రూమ్, నీటి సౌకర్యం వంటి పనులను త్వరలో చేపడుతామని తెలిపారు. టాయిలెట్లు నిర్మిస్తామన్నారు. త్వరలో ఈ పనులకు సంబంధించిన ఎస్టిమేషన్లు ఇంజినీర్లతో  తెప్పించుకొని పాఠశాలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు గోపాల్ నాయక్, జె జె నర్సయ్య, కొరడి రాజు, పర్స అనంతరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.