వెల్ నెస్ సెంటర్ కు అదనపు వసతులు కల్పిస్తాం
జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : ఉద్యోగుల, పెన్షనర్ల, జర్నలిస్టుల హెల్త్ స్కీం పరిధిలో పనిచేస్తున్న నిజామాబాద్ లోని వెల్నెస్ సెంటర్ కు కావలసిన అదనపు వసతి కల్పిస్తానని శనివారం నిజాంబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హామీ ఇచ్చారు. ఆ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు పలు దఫాలుగా జిల్లా కలెక్టర్కు చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన శనివారం పాత మున్సిపల్ కార్యాలయం వెనుక నడుస్తున్న...