ధాన్యం కొనుగోలు చేయకుంటే ఉద్యమిస్తాం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయని పక్షంలో ఉద్యమిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి అన్నారు. మొలకెత్తిని ధాన్యాన్ని ప్రదర్శిస్తూ నాయకులు, రైతులతో కలిసి సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దినేశ్ మాట్లాడుతూ.. రైతన్నల బాధలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. జిల్లాలో ఇప్పటి వరకు 8.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ఇంకా 3లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం రోడ్లపైనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షానికి ధాన్యం...