Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 May 2025, 2:46 pm Posted by : ramakrishna

ధాన్యం కొనుగోలు చేయకుంటే ఉద్యమిస్తాం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయని పక్షంలో ఉద్యమిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి అన్నారు. మొలకెత్తిని ధాన్యాన్ని ప్రదర్శిస్తూ నాయకులు, రైతులతో కలిసి సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా దినేశ్ మాట్లాడుతూ.. రైతన్నల బాధలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. జిల్లాలో ఇప్పటి వరకు 8.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ఇంకా 3లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం రోడ్లపైనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షానికి ధాన్యం మొలకెత్తుతోందని అన్నారు.

కార్యక్రమం లో కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్ కర్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మీనారాయణ, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి హరీశ్ రెడ్డి, శంకర రెడ్డి, నాయిడి రాజన్న, జనార్దన్రె డ్డి, బొబ్బిలి వేణుగోపాల్, గిరి, అమందు విజయ్ కృష్ణ, శివునూరి భాస్కర్, శ్రీధర్ గుప్తా, మఠం పవన్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

We will protest if we don't buy grain.