Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 2:25 pm Posted by : ramakrishna

ప్రభుత్వం  ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆందోళన చేస్తాం

 

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆటో కార్మీకులకు ఇచ్చిన హామీలను విస్మరించారని , ఒక్క హామీ కూడా అమలు చేయలేదని యూటియూసి జిల్లా నాయకులు కటారి రాములు అన్నారు యూనిటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (యూటియుసీ) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో  విలేఖరులతో యూటియుసీ జిల్లా నాయకులు కటారి రాములు మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ఆటో కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఆటో కార్మికులకు సంవత్సరానికి ₹12,000 చెల్లిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల సమస్యలపై స్పందించకపోవడం బాధాకరమని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆటో కార్మికులకు చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్పుల పాలవుతున్న పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇండ్లలో ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా కేటాయింపు ఇవ్వాలని తెలిపారు. ఈ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ రఫీ ఉద్దీన్, వినోద్ గౌడ్, సయ్యద్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.