Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 October 2024, 10:08 pm Posted by : ramakrishna

ఆర్జీయూకేటీని అన్ని రంగాల్లో ముందుంచుతాం

వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ గోవర్ధన్

నిజామాబాద్, బతుకమ్మ :  ఆర్జీయూకేటీని అన్ని రంగాల్లో ముందుంచుతామని వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు.  ఆర్జీయూకేటీ ప్రాంగణానికి చేరుకున్న వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్ సాగి పుష్పగుచ్చంతో శుక్రవారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ ఆర్జీయూకేటీ బాసరను అన్ని రంగాల్లో ముందు ఉంచుతామని తెలిపారు. సాంకేతిక విద్యతోపాటు క్రీడా సాంస్కృతిక రంగాల్లో రాణించేందుకు విద్యార్థులను ప్రోత్సహిస్తామని తెలిపారు. నాణ్యమైన విద్యను మరియు విద్యార్థుల నైపుణ్య అభివృద్ధిని పెంచేందుకు అవసరమైన నూతన కోర్సులను ఏర్పాటుకు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థుల సంక్షేమం పట్ల చర్యలు చేపడతామని తెలిపారు. పెండింగ్ పనులు ఉంటే ప్రభుత్వముతో సంప్రదించి పూర్తి చేస్తామని తెలిపారు. తదనంతరం పరిపాలన భవనంలో గల వివిధ పరిపాలన విభాగాలను పర్యవేక్షించారు. ఫైనాన్స్ సెక్షన్, స్కాలర్షిప్ సెక్షన్, అకాడమిక్ సెక్షన్, స్టూడెంట్ వెల్ఫేర్ సెక్షన్, లైబ్రరీ, ప్లేస్మెంట్ అండ్ ప్రక్రుమెంట్ సెక్షన్ లను పర్యవేక్షించి వాటి పనితీరును గూర్చి అడిగి తెలుసుకున్నారు.  హైదరాబాద్ ఆర్జీయూకేటీ క్యాంప్ ఆఫీసులో పదవి బాధ్యతలు స్వీకరించిన విషయం విధితమే. అంతకుముందు ఆర్జీయూకేటీ పరిపాలన భవనంలో గల వీసీ చాంబర్లో ఆసీనులై, విశ్వవిద్యాలయ స్థితిగతుల గురించి సమీక్షించిన అనంతరం విద్యార్థుల భోజనశాలలను పర్యవేక్షించారు. డైనింగ్ హాల్, కిచెన్, స్టోర్ రూమ్స్ లను పరిశీలించారు. పరిశుభ్రత, నాణ్యమైన వస్తువుల వాడకం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత పరిపాలన భవనంలో అసోసియేట్ డిన్స్ అకాడమిక్స్,స్టూడెంట్ వెల్ఫేర్ అధికారులతో సమావేశం అయ్యారు. విశ్వవిద్యాలయంలో అందిస్తున్న కోర్సుల వివరాలు, అకాడమిక్ క్యాలెండర్, వసతి గృహాల వివరాలు, విద్యార్థుల సంఖ్య, అందిస్తున్న సేవలు తదితర అంశాలను అధికారులు వివరించారు. చివరగా వివిధ విభాగాల అధికారులు వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేటెడ్ డిన్స్, పి ఆర్ ఓ తదితరులు పాల్గొన్నారు.

We will promote RGUKT in all fields