ప్రశాంత్ రెడ్డి బయట తిరగకుండా అడ్డుకుంటాం
. కాంగ్రెస్ పై చౌకబారు విమర్శలు మానుకోవాలి . డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: బీఆర్ఎస్ గుండాలను రక్షించి పోలీసులను ట్రాన్స్ ఫర్ చేయించిన చరిత్ర బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిది అని, మరోసారి ఘర్షణ వాతావరణం సృష్టిస్తే ఆయన బయట తిరగకుండా అడ్డుకుంటామని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి హెచ్చరించారు. జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు భీమ్ గల్ మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా ప్రశాంత్ రెడ్డి లేనిపోని రాద్ధాంతం చేసిన రాజకీయ...