. . . ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రైతాంగ పోరాట యోధులు అమరుడు కామ్రేడ్ శావులం సాయన్న పోరాట స్ఫూర్తితో రైతంగా ఉద్యమాలను నిర్వహిస్తామని ఎఐకెఎంఎస్జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు కామ్రేడ్ శావులం సాయన్న 30 వ వర్ధంతి సభ ను మోపాల్ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించారు.1996న ఆనాటి పీపుల్స్ వారి అరాచక శక్తులు చేసిన దాడిలో మరణించిన సాయన్న అతను చిన్ననాటి నుంచి మరణించే వరకు జీవితమంతా పేద ప్రజల కోసమే పని చేశారని వారన్నారు. రైతు కూలీల సమస్యలపై నిరంతరం పోరాడిన యోధుడని ప్రజలకు భూములు దక్కాలని భూ పోరాటాలు నిర్వహించిన గొప్ప నాయకుడని వారన్నారు. అంతిమంగా రైతు కూలీల రాజ్య స్థాపన కై చేసిన అనేక పోరాటాలు ప్రజల గుండెల్లో చిరస్థాయి గా నిలిచాయి అన్నారు. నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయలు తీసుకుంటున్నారని దేశవనురులని కార్పోరేట్ కంపెనీలకు అప్పజెప్పుతున్నారని అందులో భాగమే పచ్చటి పంట పొలాలు సైతం బహుళ బహుళ జాతి కంపెనీలకు అదాని, అంబానీలకు కట్టబెట్టి రైతులను భూముల నుంచి భేదకాలు చేస్తున్నారని భూమయ్య అన్నారు. మోదీ ప్రభుత్వం సవరణ బిల్లులతో పాటు నూతన విత్తన చట్టం గాని, ఉన్న ఆకస్తా ఉపాధి పనుల నుండి కూలీలను దూరం చేసి జీ రామ్ జీ చట్టం గానీ ప్రజా వ్యతిరేకమైనదని వారన్నారు. ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థల సేవలో తరించడం మాని ప్రజల సంక్షేమం కోసం రైతుల ఆదాయం పెంపు కోసం అంతిమంగా వ్యవసాయ రంగ రక్షణకై నిర్ణయాలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకోసం జరిగే రైతు ఉద్యమాలను నిర్మించడమే సాయన్నకు ఇచ్చిన నిజమైన నివాళులు అని అన్నారు.ఈ సభలో ఎఐకెఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అగ్గు ఎర్రన్న, సహయ కార్యదర్శి చిన్నయ్య, న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి బండమీద నర్సయ్య, రమేష్,సాయిలు, భుజేందర్,బాలయ్య తదితరులు పాల్గొన్నారు.