బెదిరించే వాళ్లు కాంగ్రెస్ నాయకులైనా.. అధికారులైనా ఊరుకోబోం
బాన్సువాడ, బతుకమ్మ: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లొద్దని కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తునట్లు తెలుస్తోందని, బెదిరించే వారు కాంగ్రెస్ నాయకులైనా, అధికారులైనా ఊరుకోబోమని ఎమ్మెల్సీ కల్వకుంట కవిత అన్నారు. బాన్సువాడలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఆమె ప్రసంగించారు. బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను, ప్రజలను బెదిరించే వారి పేర్లను పింక్ బుక్ రాసుకుంటున్నామని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ నైజమని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారెంటీ కార్టులను...