నియోజకవర్గ అభివృద్ధిపై వివక్ష సహించం

నిజామాబాద్,బతుకమ్మ:  నియోజకవర్గ అభివృద్ధిపై వివక్ష సహించమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు.  జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి కేరాఫ్ అడ్రస్ అని,  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధి పనులు ఎక్కడా కనిపించడం లేదని, అవినీతి మాత్రమే విస్తరిస్తోందని ఆయన  పేర్కొన్నారు.  తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పలు సార్లు అంశాలు...