- పోలీస్ బాస్ కు ఫిర్యాదుల వెల్లువ
- పోలీస్ ప్రజావాణికి 23 ఫిర్యాదులు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ ప్రజావాణికి అపూర్వ స్పందన లభిస్తుంది. ప్రజల నుంచి ఫిర్యాదులు పోలీస్ స్టేషన్ లలో స్వీకరించిన పరిష్కరం నోచుకోని వాటిని పోలీస్ బాస్ చెంతకు చేరితే ఇట్టే పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ప్రజల్లో పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో డయల్ యువర్ సిపి కార్యక్రమం నిర్వహించిన వాటిని గతంలో పోలీస్ బాస్ లు అటకెక్కించారు. కొందరు పోలిస్ బాస్ లు అసలు ప్రజల కష్ట సుఖాలనే మరిచారు. కాని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఫ్రెండ్లీ పోలీసింగ్ కు కేరాఫ్ గా నిలుస్తున్నారు పోతరాజు సాయి చైతన్య. ప్రజలకు చేరువయ్యేందుకు అదనపు మెజిస్ట్రేట్ హోదాలో శాంతి భధ్రతల పర్యవేక్షణకు కొత్వాల్ సాయి చైతన్య తీసుకుంటున్న చర్యలు సత్పలితాన్నిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో పోలీస్ శాఖ లో కమిషనర్ ను కలువాలంటే అసాధ్యమనే రోజులు గడిచాయి. కొందరు అసలు కమిషనర్ కార్యాలయంకు సామాన్యులు కాలు పెట్టడం అనే విషయంను గగణంగా మార్చారు. మరికొందరు కార్యాలయం గేట్ వద్దకు వచ్చిన వారిని రిసిప్షనిస్టు కు ఫిర్యాదు చేసి వెళ్లండనే పరిస్థితిని కలిపించారు. కొత్తగా కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత సాయి చైతన్య డయల్ 100 కావచ్చు… నేరుగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు ప్రతి పోలీస్ స్టేషన్ లో స్వీకరించడం సాధారణం. ఫ్రెండ్లీ పోలీస్ కారణంగా సామాన్యులకు సత్వర న్యాయం కోసం ప్రయత్నిస్తు ప్రజా వాణి కార్యక్రమం చేపట్టారు.

పోలీస్ శాఖలో ఇటీవల కాలంలో ఫిర్యాదులు పెరుగడానికి పోలీస్ అధికారుల వ్యవహార శైలి కారణం అనే వాదనలు ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలో ఎఫ్ఐఆర్ ల నమోదు కు ఎమ్మెల్యేల అనుమతి అనే పరిస్థితి ఉండేది. గతంలో ఎమ్మెల్యేల సీఫారసు లేఖలతో పోస్టింగ్ లు తెచ్చుకున్నవారు సామాన్యులకు న్యాయం కంటే లీడర్లు చెప్పిన వారికి న్యాయం చేశారు ఇతరులకు అన్యాయం చేశారనే అపవాదు ఉంది. గతంలో ఇక్కడ పనిచేసిన కమిషనర్ లే కొందరు నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ప్రజలకు న్యాయం దొరకడం గగనమైంది. ఇలాంటి పరిస్థితులలో విధులు నిర్వహించిన కొందరు సిఐలకు, ఎస్ఐలకు నాటి వాసన పోకడలు పోలేదు. దానితో ఇటీవల కాలంలో పోలీస్ శాఖలో పోలీస్ అధికారులపైనే ఫిర్యాదులు పెరిగాయి. అందుకే పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేసిన న్యాయం దక్కని వారు పోలీస్ ప్రజావాణి కి ఫిర్యాదు చేస్తే ఏకంగా కమిషనర్ ను కలువవచ్చు తక్షణం న్యాయం పొందవచ్చని సోమవారం పోలీస్ బాస్ ను కలువడానికి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు.

సోమవారం పోలీస్ ప్రజావాణికి 23 ఫిర్యాదులు వచ్చాయి. పోలీస్ కమిషనర్ గా సాయి చైతన్య బాధ్యతలు స్వీకరించిన తరువాత చేపట్టిన ప్రజా వాణికి అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల యొక్క ఎస్.ఐ, సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని పరిష్కరించారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నాము అన్నారు.
